జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లా స్థాయి క్విజ్ పోటీలు

నవ తెలంగాణ – కంటేశ్వర్

జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారని యూత్ ఫెస్ట్ లో భాగంగా జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో సోమవారం నెహ్రూ యువ కేంద్ర ఆఫీసులో జిల్లాలోని 13 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9 వ మరియు 10వ తరగతి విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్, టీబి  రక్తదానం మీద జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో మొదటి ప్రైజ్ (1000 రూపాయలు క్యాష్ ప్రైజ్), జెడ్పిహెచ్ఎస్ తోండకుర్ కు చెందిన అభినయ శ్రీ, ప్రణీత్ ద్వితీయ స్థానం (750 రూపాయలు క్యాష్ ప్రైజ్) టి ఎస్ ఎం ఎస్ ఆర్మూర్ కు చెందిన వేద శ్రీ, అఫియ ఫిరదోజ్, అలాగే తృతీయ స్థానం (500క్యాష్ ప్రైజ్) జెడ్పిహెచ్ఎస్ మాక్లూర్ కి చెందిన ఆకాంక్ష, హర్షిత కు రావడం జరిగింది. ఇట్టి ప్రైజ్ లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్. సుదర్శనం  జిల్లా యూత్ కోఆర్డినేటర్ శైలి బెల్లాల్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్. వేణుగోపాల్ , సూపెర్వైసోర్ మధుకర్, డీపీఎం సుధాకర్, నవీన్, స్రవంతి మరియు వివిధ పాఠశాల విద్యార్థులు, టీచర్స్ పాల్గొన్నారు.
Spread the love