గృహలక్ష్మి పథకం దరఖాస్తు ఫారాల కోసం మీసేవ కేంద్రంలో బారులు తీరిన జనాలు

నవతెలంగాణ- మద్నూర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు 3 లక్షల రూపాయలు అందజేస్తామని గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసుకోవాలని ఈనెల 10వ తేదీ చివరగా ఉందని దరఖాస్తుదారులు గృహలక్ష్మి దరఖాస్తు ఫారాల కోసం మండల కేంద్రంలో గల మీసేవ కేంద్రం వద్ద జనాలు బారులు తీరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఎలక్షన్ కార్డు స్థలం కాగితాలు ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో మండల కేంద్రంలో గురువారం నాడు దరఖాస్తుల స్వీకరణ తేదీ ఈ నెల 10 తో ముగుస్తుందని తెలియడంతో గృహలక్ష్మి ఇండ్ల మంజూరు కోసం దరఖాస్తులు అందజేసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో గృహలక్ష్మి ఫారాలు పొందడానికి మీ సేవ కేంద్రానికి భారీగా వచ్చారు వీటితోపాటు కులం సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనే దానిపై గృహలక్ష్మి దరఖాస్తుదారులు అన్ని రకాల ఫారాలకు పరుగులు తీశారు స్థలం ఉన్నవారు ఎలాగైనా దరఖాస్తు చేసుకుంటారు. కానీ స్థలం లేని వారు రేషన్ కార్డు లేని వారు దరఖాస్తులు చేసుకోలేక ఈ ప్రభుత్వం లేనోళ్లకు ఇండ్లు ఇవ్వాలి కానీ ఇల్లుండి ఇళ్ల స్థలాలు ఉన్న వారికే దరఖాస్తులు తీసుకోవడం అసలైన ఇల్లు లేక ఇండ్ల కోసం ఎదురుచూసే నిరుపేదలకు ఈ ప్రభుత్వం ఏమి న్యాయం చేస్తుందని అర్హులైన ఇల్లు లేక ఇండ్ల స్థలాలు లేక బాధపడుతున్న లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గృహలక్ష్మి పథకం ప్రతి ఒక్కరికి అందే విధంగా ఇల్లు లేక ఇండ్ల స్థలాలు లేని వారికి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ స్థలాల్లో ఇండ్ల పట్టాలు అందజేసి ఆదుకోవాలని నిరుపేదలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Spread the love