నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల టీచర్స్ కాలనీ అంగన్వాడి కేంద్రంలో మంగళవారం నాడు పుట్టిన బిడ్డకు తల్లి ముర్రిపాల ప్రాముఖ్యత గురించి అంగన్వాడీ టీచర్లు చంపాబాయి కళావతి ఆయా సెంటర్ల పరిధిలోని గర్భవతులకు అవగాహన కల్పించారు. తల్లిపాల వారోత్సవాలు భాగంగా అంగన్వాడి సెంటర్లో తల్లి ముర్రి పాల ప్రాముఖ్యత అవగాహన కల్పించినట్లు అంగన్వాడి సెంటర్ల టీచర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇక్బాల్ ఆయా సెంటర్ల టీచర్లు సెంటర్ల పరిధిలోని తల్లులు గర్భవతులు తదితరులు పాల్గొన్నారు.