గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చెయ్యాలి: ఎమ్మార్పీఎస్ నాయకులు

నవతెలంగాణ -మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు కార్మికుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తూ దీక్షలు కూర్చున్నారు  ఈ సందర్భంగా నాయకుడు బాలు యాదవ్ మాట్లాడుతూ గ్రామానికి వెన్నుముక్క అయినటువంటి గ్రామపంచాయతీ కార్మికులు వాళ్ళ బాధలు ఆవేదన ప్రభుత్వం తక్షణమే తీర్చాలని కోరుతున్నాం గ్రామాన్ని తన ఇల్లు లాగా భావించి మనం ఇంటిని ఎలాగో శుభ్రపరచుకుంటాము అదేవిధంగా గ్రామాన్ని వాళ్లు అంత శుభ్రంగా ఉంచుతారు అంత గొప్ప మనసు ఉన్నటువంటి పంచాయతీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. జి ఓ నంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని ప్రభుత్వం వీరి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రమాదాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబానికి 10 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మరోతి కర్రేవార్, కొలవార్ పండరి, మరోతి గడ్డంవార్,రాజు గడ్డంవార్, లక్ష్మణ్ గాడ్డంవార్, మరోతి,గంగారాం, సంగ్రామ్, అంజయా ఈర్బా, హన్మంత్, మరోతి రామ, పండరి, దేవదాస్, రాజేందర్, రాజు ద్యాపుర్వార్, రాందాస్ రామ గడ్డంవార్,నగేష్ రాజు, సంతోష్, అనిల్, శ్రీకాంత్, సంతోష్ కొంబ్లే, లక్ష్మణ్ సంబజి, శ్రీకాంత్, లక్ష్మణ్ ద్యపుర్వర్, తదితరులు యువకులు పాల్గొన్నారు.
Spread the love