నవతెలంగాణ – మద్నూర్
రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మంచి మంచి పథకాలు అమలు చేస్తూ రైతులకు ఆదుకుంటుందని అమల్లో కొనసాగుతున్న రైతు బందు పథకం రైతు బీమా పథకం ఆదర్శంగా నిలుస్తున్నాయని ఈ రెండు పథకాలు వ్యవసాయ రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని మండల తాసిల్దార్ అనిల్ పేర్కొన్నారు రైతు దినోత్సవ వేడుకల్లో భాగంగా మద్నూర్ మండలంలోని మేనూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు దినోత్సవానికి తాసిల్దార్ ప్రత్యేక అధికారిగా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చక్కటి పథకాలు అమలు చేసి రైతులకు ఆదుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి అనిల్ మేనూరు గ్రామ సర్పంచ్ విట్టల్ గురించి సొసైటీ డైరెక్టర్ విజయ్ కో ఆప్షన్ నెంబర్ నిజాముద్దీన్ ఎంపిటిసి మందాకిని శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వై గోవింద్ క్లస్టర్ పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు రైతులు పాల్గొన్నారు.