నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని హెచ్ కేలూర్ గ్రామాన్ని మంగళవారం మండల అభివృద్ధి అధికారి రవి ఈశ్వర్ గౌడ్ సందర్శించి పల్లె ప్రగతి అభివృద్ధి పనుల్లో భాగంగా పల్లె పకృతి వనం స్మశాన వాటిక కంపోస్ట్ షెడ్డు పరిశీలించారు. హెచ్ కెలూరులో చేపట్టిన పల్లె ప్రగతి అభివృద్ధి పనులపై ఎంపీడీవో ఆ గ్రామ సర్పంచ్ నీలావతి హనుమాన్లు తో మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులు, బి హనుమాన్లు, హెచ్ కేలూర్ గ్రామ కార్యదర్శి రాములు, సలాబత్పూర్, గ్రామ కార్యదర్శి రవికుమార్, అంతాపూర్ గ్రామ కార్యదర్శి ప్రమోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు .