రెండవసారి మద్నూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వట్నాల వార్ రమేష్

నవతెలంగాణ- మద్నూర్
కామరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్, అలాగే మాజీ మంత్రి వర్యులు షబ్బీర్ అలీ, జుక్కల్ నియోజకవర్గం ఇంఛార్జ్ సౌదగర్ గంగారాం, గారి ఆధ్వర్యంలో రెండవ సారి ఏన్నికాయినటువంటి మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వట్నాలవార్ రమేష్ కు సన్మానించి, అపయిట్మెంట్ లెటర్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా రెండోసారి మండల పార్టీ అధ్యక్షులు ఎన్నికైన వట్నాల రమేష్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి జుక్కల అసెంబ్లీ నుండి పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా కృషి చేయడం జరుగుతుందని రెండోసారి తనను మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక చేసి సన్మానించిన మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీకి అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారికి జుక్కల్ నియోజకవర్గం ఇంచార్జ్ సౌధాగర్ గంగారం గారికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Spread the love