పుట్టు ఒల్లెల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సన్మానం

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ధ్యాపూర్వార్ సంతోష్ కూతురి పుట్టు ఒల్లెల శుభ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే హాజరై చిన్నారి పాపకు ఆశీర్వదించారు. శుభ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే తో పాటు గ్రామ సర్పంచ్ సురేష్ కు కూడా శాలువతో సత్కరించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ హనుమాన్లు రైతు సమన్వయ సమితి కన్వీనర్ కంచి హనుమాన్లు టిఆర్ఎస్ పార్టీ గ్రామ యువ నాయకులు తులసిరాం తదితరులు పాల్గొన్నారు.

Spread the love