– మేనూర్ గ్రామస్తుల ఆవేదన
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో గ్రామస్తులు ఒక కమిటీగా ఏర్పడి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ యువకులకు మంచి చదువులు అందే విధంగా ప్రయివేట్ పరంగా లైబ్రరీ రోజు వారి సమయపాలనతో కొనసాగగా ఇటీవల కాలంలో ప్రభుత్వం మేనూర్ గ్రామానికి లైబ్రరీ మంజూరు చేసింది. ప్రభుత్వ పరంగా మంజూరైన లైబ్రరీ ప్రారంభోత్సవానికి పరిమితమైందని ప్రారంభించిన నాటినుండి నేటి వరకు చేర్చుకోవడం లేక లైబ్రరీ చదువులు విద్యార్థులకు యువకులకు గ్రామస్తులకు అందడం లేదని బుధవారం నాడు లైబ్రరీ ఎదుట నిలబడి విద్యార్థులు గ్రామస్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు కుశాల్ పటేల్ మాట్లాడుతూ గతంలో గ్రామస్తులను ఒక కమిటీగా ఏర్పడి లైబ్రరీని ప్రారంభించుకొని కావాల్సిన పుస్తకాలు తెప్పించి స్వచ్ఛందంగా నడిపించిన లైబ్రరీని ప్రభుత్వం మేనూరు గ్రామానికి లైబ్రరీ ఏర్పాటు చేయగా దానిని ప్రభుత్వ పరంగా ప్రారంభించుకోవడం జరిగిన నాటి నుండి పూర్తిగా మూతపడే ఉంటుందని మూతబడిన లైబ్రరీని వెంటనే తెరిపించి గ్రామ యువకులకు విద్యార్థులకు పెద్దలకు లైబ్రరీ చదువులు అందించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ గోపాల్ ఆ గ్రామ విద్యార్థులు పాల్గొన్నారు.