Wednesday, May 27, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు

ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: మేడ్చల్‌, కొండాపూర్‌, నాగోల్‌ ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కార్యాలయాల్లో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఆన్‌లైన్‌ ఫీజుకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఏసీబీ అధికారులు ఈ అవకతవకలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ధ్రువపత్రాల మంజూరులో దళారుల పాత్రను ఏసీబీ గుర్తించింది. కొండాపూర్‌ ఆర్టీఏ కార్యాలయం వద్ద 150 ప్రింటెడ్‌ ఆర్సీలు, డీఎల్‌లు స్వాధీనం చేసుకున్నారు. నాగోల్‌ కార్యాలయంలో ఏజెంట్ల వద్ద రూ.2.41 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -