
మండలంలోని అరూర్ మధిర గ్రామమైన అప్పారెడ్డిపల్లెకు చెందిన తుమ్మల రవీందర్ రెడ్డి కి చెందిన మామిడి చెట్లు పక్క రైతు పొలానికి నిప్పంటించడంతో మoటలు వ్యాపించి మామిడి చెట్లకు అంటుకొని సుమారుగా 150 మామిడి చెట్లు దగ్ధం అయ్యాయి. వాటి విలువ సుమారు 1 లక్షా 50 వేలు ఉంటుందని,10 వేల రూపాయల విలువ గల ప్లాస్టిక్ పైపులు దగ్ధం అయ్యాయని, వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి మంటలు ఆర్పారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది అశోక్ రెడ్డి , శ్రీనివాస్, నాగరాజు, సంజీవ తదితరులు పాల్గొన్నారు.