– అల్లర్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి
– బాధితులకు ఆర్థిక సహాయం అందించాలి : అవాజ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బక్రీద్ సందర్భంగా మెదక్‌లో పథకం ప్రకారమే సంఫ్‌ు పరివార్ మూకలు మత కలహాలు సృష్టించి అల్లర్లకు పాల్పడ్డారని అవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి దాడుల మూలంగా ముస్లింలు ఆస్తులతో పాటు వారి జీవనాధారాలను ధ్వంసం చేశారని తెలిపారు. అల్లర్లకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జీవనోపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బక్రీద్ ముందు నుంచి గోరక్షక దళాల పేరుతో ముస్లింలపై దాడులు చేయటానికి సంఫ్‌ు పరివార్ ప్రణాళికలు రూపొందించుకున్నదని తెలిపారు. అందులో భాగంగానే ముస్లింల దగ్గర ఉన్నవి ఆవులు కావు, మగపశువులే అని పశువుల డాక్టర్లు, పోలీసులు చెప్పారనీ, వాటిని కూడా గోశాలకి తరలిస్తామని పోలీసులు చెప్పారనీ, అంతటితో ఆగితే విధ్వంసం అల్లర్లు జరిగేవి కాదని పేర్కొన్నారు. సంఫ్‌ు పరివార్ లక్ష్యం గోవులను రక్షించడం కాదనీ, అల్లర్లు సృష్టించడమేనని స్పష్టం చేశారు. ఆ మూకలు కావాలనే మదర్సాల్లోకి, ముస్లింల ఇళ్లలోకి చొరబడి దాడులకు పాల్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇళ్లల్లోకి అక్రమంగా చొరబడుతున్న మూకలను అడ్డుకుంటే హిందువులపై దాడి చేశారంటూ దుష్ప్రచారం చేయటమేంటని ప్రశ్నించారు. గాయపడిన ముస్లింలకు చికిత్స చేస్తున్న ఆస్పత్రిపై దాడి చేసి విద్వంసం సష్టించారని తెలిపారు. ముస్లింలకు చెందిన షాపులను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. విధ్వంసానికి గురైన ఆస్పత్రి కూడా ముస్లింలది కావటమే గమనార్హమని తెలిపారు. ఈ ఘటనలన్నీ ఒక పథకం ప్రకారం జరిగినవే అని స్పష్టం చేశారు. గో రక్షణ పేరుతో ముస్లింల ఆస్తులనీ, జీవనాధారమైన షాపులని విధ్వంసం చేయడం, అల్లర్లు సష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేండుకు సంఫ్‌ు పరువార్ మూకలు ప్రయత్నించాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా లేక పోవటం వలన అల్లరి మూకలు రెచ్చిపోయారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావాలనీ, మత విద్వేషాలు రెచ్చగొట్టే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.