క్రీడా ప్రాధికార సంస్థ
చైర్మెన్ శివసేనా రెడ్డి
హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్
ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ-హైదరాబాద్ : క్రీడా పాఠశాలలో పరిశుభ్రత, క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్ కే. శివసేనారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌ను శివసేనారెడ్డి ఆకస్మికంగా తనిశీ చేశారు. వంట గది, డైనింగ్ హాల్, హాస్టల్ రూమ్‌లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాఠశాలలను ప్రతిష్టాత్మంగా తీసుకుంటుంది. గచ్చిబౌలి స్టేడియం, ఎల్బీ స్టేడియంలో సైతం నూతనంగా అకాడమీలు ఏర్పాటు చేస్తూ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా క్రీడలను అభివృద్ది పరిచే దిశగా అధికారులు పని చేయాలని, విధుల నిర్వహణలో అలక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని శివసేనారెడ్డి హెచ్చరించారు. స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీ మమత, కోచ్‌లు, సిబ్బంది తనిఖీ సమయంలో చైర్మెన్‌తో పాటు ఉన్నారు.
విధుల్లో అలక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
- Advertisement -
- Advertisement -



