- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సిఐఎస్‌సీఈ సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఉత్సాహంగా సాగుతోంది. బాయ్స్-17 విభాగంలో ఎన్‌ఏఎస్‌ఆర్ బాయ్స్ స్కూల్, ఫ్యూచర్ కిడ్జ్ స్కూల్ ముందంజ వేశాయి. బుధవారం జరిగిన పోటీల్లో ఎన్‌ఏఎస్‌ఆర్ స్కూల్ వరుసగా సెయింట్ జొసెఫ్ పబ్లిక్ స్కూల్‌పై (కింగ్‌కోఠి) 8-0తో, ఫ్యూచర్ కిడ్జ్ స్కూల్‌పై 2-0తో, సెయింట్ జొసెఫ్ (వనస్థలిపురం)పై 3-0తో ఘన విజయాలు సాధించింది. షేర్‌వుడ్ స్కూల్‌తో మ్యాచ్‌ను టైగా ముగించింది. ఫ్యూచర్ కిడ్జ్ స్కూల్ 3-0తో సెయింట్ జొసెఫ్ పబ్లిక్ స్కూల్‌పై గెలుపొందింది.
- Advertisement -



