తరుగు పేరుతో రైతులను మోసం చేసిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి: వెంకట్ గౌడ్

నవతెలంగాణ – గాంధారి
ఈరోజు గాంధారి మండలంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ మాట్లాడుతూ.. కోనుగోలు కేంద్రం వద్ద రైతుల ఇబ్బందులు తేలుసుకోన్నమని, ఇదే పరిస్థితి జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తమ పంటను అమ్ముకోవడానికి నానా కష్టం పడుతున్నారని, అటువంటి రైతులను ఆసరా చేసుకుని పండించిన పంటను తొందరగా పంపించడం కోసం తరుగు పేరు మీద రైతులను మోసం చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న కొంతమంది సిబ్బంది అదేవిధంగా రైస్ మిల్ యజమానులు కుమ్మక్కై రైతులను క్వింటాలకు 5 కిలోల చొప్పున తరుగు పేరుతో మోసం చేసి పంటను తరలిస్తున్నారని, ఇటువంటి తరుగు పేరుతో మోసం చేసిన వాటిని జిల్లా కలెక్టర్ గారు స్పందించి సరైన దర్యాప్తును జరిపించి తరుగు పేరుతో ఇప్పటివరకు ఎంత ధాన్యం రైస్ మిల్లర్లుకు తరలించరో, సంబంధించిన రైతులు అందరికీ ప్రతి కింటాలుకు ఐదు కిలోల చొప్పున ధర కట్టించి ఇవ్వాలని, అదేవిధంగా వర్షంతో తడిసిపోయిన ధాన్యాన్ని తూకం వేయాలని వారికి అధికతరుగును డిమాండ్ చేయకూడదని, అదేవిధంగా ఈరోజు రేపు వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం చెప్పింది. కాబట్టి కొనుగోలు కేంద్రాల వద్ద తగు ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈరోజు జరిగిన సమావేశంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ తో పాటు జిల్లా కోర్ కమిటీ సభ్యులు మోతిరాం నాయక్ మండల నాయకులు ప్రకాష్, కిషన్ రావు, సాయిలు,మధు తదితరులు పాల్గొన్నారు.
Spread the love