ఇటుక బట్టీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి

– దాసరి పాండు సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
నవతెలంగాణ – బొమ్మలరామారం

బొమ్మలరామారం మండలంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న ఇటుక బట్టీల యాజమాన్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు మాట్లాడుతూ..మండల కేంద్రంలో ఇటుక బట్టీల యజమానులపై చర్యలు తీసుకోవాలని, చీకటిమామిడి నుండి మర్యాల రోడ్డు వరుకు రహదారుల పక్కనే అనుకొని ఉండడంతో బట్టిల నిర్వహణతో వెలువడే పొగ వాయు కాలుష్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటుక మట్టిలో పొడిని రోడ్డు పక్కనే గుట్టలుగా పొయ్యడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యజమాన్యాలు అనుమతులు లేకుండా కనిజ సంపాదన మట్టిని గ్రామాల్లో ఉన్న కుంటలు చెరువులకు సంబంధించిన మట్టిని అడ్డు అదుపు లేకుండా లోతులో తోవ్వుతున్నారని మట్టి రవాణాకు భారీ టిప్పర్లను వినియోగించడంతో రోడ్డు అంతా పూర్తిగా గుంతలుగా మారుతుంది. లారీల వల్ల దుమ్ము ధూళి రావడంతో వాహనాలు నడపడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నాయని అనేక సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని దీనితో పాటు ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకొచ్చి  కనీస  వేతనాలు చెల్లించకుండా చిన్న పిల్లలతో పని చేయించుకుంటూ యాజమాన్యాలు లాభాలు గడిస్తున్నారని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కమిటీ మండల కార్యదర్శి ర్యకలశ్రీశైలం,  మండల కమిటీ సభ్యురాలు ముక్కల పున్నమ్మ,తదితరులు పాల్గొన్నారు.
Spread the love