ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలి 

 – కలెక్టర్ కు  ఫిర్యాదు
 నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం జిలకర కుంట తండా ప్రాదమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న పసుల కాశయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మిర్యాలగూడకు చెందిన డి. రాజు సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న పసుల కాశయ్య ఎటువంటి సెలవు పెట్టకుండా, పై అధికారుల అనుమతి లేకుండా పాఠశాల విధులకు గైర్హాజర్ అవుతున్నారని తెలిపారు. కానీ పాఠశాల విధుల్లో హాజరైనట్టు రిజిస్టర్లో దొంగ సంతకాలు నమోదు చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా సహెూపాధ్యాయునితో కలిసి వంతుల వారిగా, షిఫ్ట్ పద్ధతిలో స్కూల్ ను నడుపుతున్నారని ఆరోపించారు. అట్టి ప్రదానోపాద్యాయునిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు  విజ్ఞప్తి చేశారు.
పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారని, పాఠశాలను వారు పూర్తిగా షిఫ్ట్ సిస్టంలో నడుపుతున్నరని తెలిపారు. ఈ పాఠశాలలో ఒకరు హాజరైతే, మరొకరు హాజరు కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధికారుల నుండి ఎటువంటి సెలవు అనుమతి లేకుండా మిర్యాలగూడ పట్టణంలో తన వ్యక్తిగత పనుల నిమిత్తం అనగా వైన్స్ టెండర్ లు అని, రియల్ ఎస్టేట్ పనులు అని తిరుగుతూ ఉంటాడు. కానీ పాఠశాలలో మాత్రం ప్రతిరోజు హాజరైనట్లుగా, విద్యార్థులకు పాఠాలు బోధించినట్లుగా రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నట్టు తెలిపారు. ఇలా ఒకరోజు ఒకరు, మరొకరోజు మరోకరు వంతుల వారిగా డ్యూటీ లు పంచుకుంటారు. ఈ విషయంపై  కాంప్లెక్స్ ప్రదానోపాధ్యాయులకు, మండల విద్యాధికారికి తెలిసినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. తనకు రాజకీయ అండదండలు ఉన్నాయని, ఉపాధ్యాయ సంఘం, అండదండ ఉన్నదనే ధీమాతో ఉన్నతాధికారులకు ఆమ్యామ్యాలను అప్పజెప్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉపాధ్యాయులు ఇద్దరూ షిఫ్ట్ సిస్టంలో పాఠశాల నడుపుతూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఒక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి పాఠశాలలపై శ్రద్ధ వహించి తనిఖీలు చేయాలని సూచించారని, ముఖ్యంగా గిరిజన తండాల్లో ఉన్న పాఠశాలలపై దృష్టి సారించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు.
            అయినప్పటికీ జిలకరకుంట తండా ప్రదానోపాధ్యాయులు పసుల కాశయ్య మార్చ్ నెల 23, 26,30 తేదీలలో అదేవిధంగా  ఏప్రిల్ 3న  ఉన్నతాధికారుల నుండి ఎలాంటి సెలవు అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొట్టి మిర్యాలగూడ పట్టణంలో తన సొంత పనుల నిమిత్తం యాదేచ్చగా తిరిగాడని, ఆ తరువాత ఆయా తేదీలలో పాఠశాల విధులకు హాజరయినట్లుగా, పాఠాలు బోధించినట్లుగా రిజిస్టర్ లో సంతకాలు పెట్టినాడు. దీనికి సంబందించి కాంప్లెక్స్ ప్రదానోపాద్యాయులను వివరణ కోరగా ఆయా తేదీలలో ప్రదానోపాద్యాయులు పసుల కాశయ్య ఎలాంటి సెలవు అనుమతి తీసుకోలేదని ద్వికరించినట్టు పేర్కొన్నారు. వీటికి సంబందించిన జీపీఎస్ సిస్టమ్ తో కూడిన వీడియో ఫుటేజ్ లను, ఫోటోలు, సంబంధిత పత్రాలు కూడా  కలెక్టర్ కు అందచేసినట్లు తెలిపారు. విధుల నిర్లక్షానికి పాల్పడిన పాఠశాల ప్రధానోపాయులు పసుల కాశయ్య పై విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ ను  కోరారు.
Spread the love