
– 500 హెక్టార్ లు స్వాధీనం….
– విలేకర్లు సమావేశంలో డీసీ ఎఫ్ వెల్లడి.
నవతెలంగాణ – అశ్వారావుపేట
అడవులు పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నాం అని డీసీఎఫ్( డిప్యూటీ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్స్) కే.దామోదర్ రెడ్డి తెలిపొరు.ఇందుకు పలు నర్సరీల్లో 5 లక్షలు మొక్కలు పెంచుతున్నాం అని అన్నారు. స్థానిక ఫారెస్ట్ రేంజర్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్న అటవీ నర్సరీ ని బుధవారం సందర్శించారు. అనంతరం ఆయన విలేకర్లు సమావేశంలో మాట్లాడారు. నూతనంగా అటవీశాఖ జీ సీపీ( గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం) క్రింద అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి లోని రిజర్వ్ ఫారెస్ట్ లో గతేడాది 50 హెక్టార్ల లో అన్ని రకాల కలప జాతి మొక్కలను పెంచుతున్నాం అని అన్నారు. ఈ ఏడాది అశ్వారావుపేట,దమ్మపేట,ములకలపల్ లి మండలాల్లో మొక్కలు పెంపకానికి సిద్దం చేసినట్లు వివరించారు.అదే “కంప” పధకం నిధులతో స్వాధీనం చేసుకున్న
పోడు భూములు లో అటవీ అభివృద్ధి చర్యలకు ప్రణాళికలు అమలు చేయనున్నామని తెలిపారు. 500 హెక్టార్ల వరకు పోడు భూములు స్వాదీనం చేసుకున్నామని అన్నారు. వీటిలో 135 హెక్టార్లలో ప్లాంటేషన్ ల కోసం టేకు, వెదురు,ఇతర కలప జాతి మొక్కలు ఉన్నాయని,అలాగే కొత్తగా తునికి స్మగ్లింగ్ ఎక్కువ అవుతుందని, నియంత్రణకు నిఘా పటిష్టం చేసినట్లు వివరించారు.
ఇటీవల భద్రాచలం,ఇల్లందు ప్రాంతాల్లో అక్రమంగా రవాణ అవుతున్న తునికి కలప లారీలను సీజ్ చేసినట్లు చెప్పారు.తునికి ఆకు సేకరణకు ఇంకా టెండర్లు ఖరారు కాలేదని,అయిన వెంటనే ఫ్రూనింగ్ పనులు ప్రారంభిస్తామని,ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల కొంత అలస్యం అయిదని సమాధానం ఇచ్చారు. అడవుల నుండి అక్రమంగా ఇసుక,మట్టి రవాణా పై దాడులు విస్తృతం చేశామని,ఇప్పటికే వాహనాలు సీజ్ చేసి సుమారు రూ.35 లక్షల వరకు జరిమానా వసూలు చేశామని అన్నారు. అటు శాఖలో సిబ్బంది కొరత ఉందని, ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అశ్వారావుపేట చెక్ పోస్ట్ ఆక్రమణకు గురైందని,కొందరు భూమి తమదేనంటూ కోర్టుకు వెళితే 2023 ఏప్రిల్ నెలలో పిర్యాదు చేసి అటవీ శాఖ ద్వారా సమాదానం తీసుకోవాలని సూచించినప్పటికీ ఇంతవరకు ఎవరూ పిర్యాదు చేయలేదని పేర్కోన్నారు.ఇప్పుడు చెక్ పోస్ట్ చుట్టూ ఉన్నవారికి ఏ హక్కు లేదని, అందరూ ఆక్రమణ దారులేనని చెప్పారు. మంగళవారం రాత్రి కొందరు చెస్ట్ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా ఖాళీ చేయించామని అన్నారు. ఆయన వెంట సెక్షన్ ఆఫీసర్ కృష్ణమూర్తి,ఎఫ్ఆర్ఓ మురళీ సిబ్బంది ఉన్నారు.