నటుడు విజయ్‌ ఆంటోని కుమార్తె ఆత్మహత్య

నవతెలంగాణ – హైదరాబాద్: నటుడు విజయ్‌ ఆంటోని కుమార్తె లారా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఒత్తిడి కారణంగా 12వ తరగతి చదువుతున్న లారా ఆత్మహత్యకు పాల్పడినట్లు తమిళనాడు ఆళ్వార్‌పేట పోలీసులు తెలిపారు. లారా ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ ఆంటోని కూతురు లారా చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. చెన్నైలోని డీడీకే రోడ్‌లోని తన ఇంట్లో సెప్టెంబర్ 19వ తేదీ తెల్లవారుజామున లారా ఉరి వేసుకుని కనిపించినట్లు సమాచారం. దీంతో ఆమెను వెంటనే చెన్నై ఆళ్వార్‌పేటలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

Spread the love