న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ కొత్తగా ఆభరణాల వ్యాపారంలోకి ప్రవేశించింది. ‘ఇంద్రియ’ బ్రాండ్ పేరుతో ఈ రంగంలోకి వచ్చినట్లు తెలిపింది. దేశంలో ఆభరణాల వ్యాపారానికి రిటైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం కోసం రూ.5,000 కోట్ల పెట్టుబడుల వ్యయం చేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. తొలుత ఢిల్లీ, ఇండోర్, జయపురలో నాలుగు స్టోర్లను తెరవనున్నామని.. వచ్చే ఆరు నెలల్లో 10 నగరాలకు విస్తరించనున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా వెల్లడించారు. 20 ఏళ్లుగా ఫ్యాషన్ రిటైల్, లైఫ్‌స్టైల్ పరిశ్రమలో తాము రాణిస్తున్నామన్నారు.