ప్రమాణ స్వీకారం వాయిదా?

నవతెలంగాణ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా గ్రూప్ రాజకీయాలు ఎక్కువే. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో సీఎం పీఠం కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య గ్రూప్ రాజకీయాలు నడిచాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం తర్వాత అక్కడ సీఎం అభ్యర్థి ప్రకటన జరిగింది. ఇప్పుడు ఇదే సీన్ తెలంగాణలోనూ రిపీట్ అవుతోంది. అందరూ రేవంత్‌రెడ్డి సీఎం అని ఫిక్స్ అయిన వేళ.. కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు  హోటల్‌ ఎల్లాలో జరుగిన సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మధ్య గ్రూప్ వార్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు మరింత జాప్యం కానుంది. సీఎం ఎవరో అధిష్టానం ఫిక్స్ చేయాల్సి ఉండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.
మరోవైపు ఏఐసీసీ పెద్దలు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బిజీగా ఉండటంతో… ఢిల్లీకి ఏఐసీసీ పరిశీలకులు ఈరోజు రాత్రికి వెళ్లనున్నారు. ఢిల్లీలో డి.కె.శివకుమార్ ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమైన తర్వాత సీఎం పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తాజా పరిణామాల కారణంగా ఈనెల 6న తెలంగాణ నూతన సీఎం ప్రమాణ స్వీకారం జరగనుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సీఎం అభ్యరిత్వం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇతర కీలకమైన శాఖ విషయంలోనే చర్చలు కొనసాగుతున్నాయి. కొల్కిరావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Spread the love