Monday, June 8, 2026
E-PAPER
Homeఆటలుఅరంగేట్రంలోనే అదరగొట్టిన మానవ్ సుతార్..152 పరుగులకే ఆఫ్గాన్‌ ఆలౌట్

అరంగేట్రంలోనే అదరగొట్టిన మానవ్ సుతార్..152 పరుగులకే ఆఫ్గాన్‌ ఆలౌట్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది. మూడో రోజు ఆటలో భారత బౌలర్ల ధాటికి అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. దీంతో 412 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రత్యర్థి జట్టుకు ఫాలోఆన్ విధించాడు. అదేవిధంగా భారత యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. కేవలం 33 పరుగులిచ్చి 6 వికెట్లు నేలకూల్చాడు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 3, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ షా ఒక్కడే 60 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా మిగతా వారంతా చేతులెత్తేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -