న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల వేదిక ఫోన్‌పే సేవలు ఇకపై యునైటెడ్ అరబ్ ఎమరైట్స్ (యుఎఇ)లోనూ ఉపయోగించుకోవ డానికి వీలుంది. ఇందుకోసం ఆ సంస్థ అక్కడి నియోపేతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో యుఎఇలోని నియోపే టెర్మినల్స్‌లో చెల్లింపులు చేయవచ్చు.”ప్రతీ ఏడాది లక్షలాది మంది యుఎఇని సందర్శిస్తారు. తమ భాగస్వామ్యం ద్వారా అవాంతరాలు లేని లావాదేవీలకు దోహదం చేయనుంది.” అని ఫోన్‌పే ఇంటర్నేషనల్ పేమెంట్స్ సిఇఒ రితేష్ పారు పేర్కొన్నారు. ఇది రెండు దేశాల మధ్య ఇప్పటి కే బలంగా ఉన్న ఆర్థిక సంబంధాలను మరింత సుస్థిరం చేయడానిక సహాయపడనుందని నియోపే సిఇఒ విభోర్ ముందాడ ఆశాభావం వ్యక్తం చేశారు.