మై హోమ్‌ నుంచి ‘అక్రిడా’ ప్రాజెక్టు

– గోపన్‌పల్లిలో 25 ఎకరాల్లో నిర్మాణం
హైదరాబాద్‌: ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ మై హోం గ్రూప్‌ మరో ప్రతిష్టాత్మక నివాస ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. నగరంలోని గోపన్‌పల్లి నుండి తెల్లాపూర్‌ రోడ్‌ మధ్యలో మై హోమ్‌ అక్రిడా పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తోన్నట్లు పేర్కొంది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ సమీపంలోని అక్రిడా కింద 12 టవర్లలో 3780 ఫ్లాట్‌లను నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఫేజ్‌-1లో భాగంగా 6 టవర్లు బుకింగ్‌ కోసం తెరువబడ్డాయని వెల్లడించింది. ప్రతిమ గ్రూప్‌ భాగస్వామ్యంలో దాదాపు 24.99 ఎకరాలలో జిప్లస్‌ 39 అంతస్తుల్లో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తలిపింది. ఫ్లాట్ల పరిమాణం 1399 చదరపు అడుగుల నుంచి 2347 చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. సౌకర్యం, లొకేషన్‌ సౌలభ్యం, కమ్యూనిటీలకు దగ్గరగా ఉండేలా హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లను అభివృద్థి చేయడంలో మై హోం మూడు దశాబ్దాలుగా అగ్రగామిా ఉందని మై హోమ్‌ గ్రూపు ఛైర్మన్‌ రామేశ్వర్‌ రావు పేర్కొన్నారు.

Spread the love