పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకోవాలి

–  పైడాకుల అశోక్, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు.
నవతెలంగాణ – గోవిందరావుపేట
నవంబర్ 01 2020 వరకు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటర్ కార్డును నమోదు చేసుకోవాలి అని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తైడాకుల అశోక్ పిలుపునిచ్చారు.ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు సందర్భంగా మాట్లాడారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినా పట్టభద్రులు కూడా మళ్ళీ తహశీల్దార్ కార్యాలయంలో కావాల్సిన పత్రాలు సమర్పించి ఓటర్ కార్డును నమోదు చేసుకోవాలని కోరారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ త్వరలో రానున్న సందర్బంగా ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ పట్టభద్రులు (సోదర, సోదరీమణులు) విద్యార్థి, విద్యార్థినులు త్వరగా ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకుని, ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి, ఆ దిశగా ఎన్నికల సంఘం ప్రక్రియను కూడా వేగవంతంగా ప్రారంభించనుంది. కావున ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టభద్రులు అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. అలాగే ఓటు హక్కును అందరూ సద్వినియోగపరుచుకోవాలి అని కోరారు. అదేవిధంగా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినా వారు కూడా మళ్ళీ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. అలాగే   ప్రభుత్వ అధికారులకు, ఉపాధ్యాయులకు, వివిధ  వ్యాపార, ప్రైవేట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న, నిరుద్యోగ విద్యార్థులు నవంబర్ 01 2020 వ సంవత్సరం వరకు డిగ్రీ పూర్తి చేసినవారు అందరూ కూడా ఓటును నమోదు చేసుకోవాలని కోరారు.
  ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు, డిగ్రీ ప్రోవిషనల్ సర్టిఫికెట్ జీరాక్స్, ఓటర్ ఐడి జీరాక్స్, పాస్ ఫోటో ముఖ్యంగా 2020 నవంబర్ 1 తేది నాటి కంటే ముందే డిగ్రీ పాస్ అయి ఉన్నవారే అర్హులని కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్ గా నమోదు చేసుకొని పట్టణ మరియు గ్రామాలలో ఉన్న వారు సమయం కేటాయించి ఆన్లైన్ లో ఓటు హక్కును నమోదు చేసుకొని ప్రతి ఒక్కరు ఓటును సద్వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా మీకు వీలు కాకపోతే ప్రతి గ్రామంలో మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటారు కాబట్టి వారికి మీకు సంబందించిన జిరాక్స్ సర్టిఫికేట్ ఇస్తే తహశీల్దార్ కార్యాలయాల్లో ధరకాస్తు చేస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఎవరి గ్రామంలో వారు డిగ్రీ పట్టభద్రులను గుర్తించి వారికి ఓటరుగా నమోదు చేసుకొనే విధంగా ఫిబ్రవరి 06వ తేది వరకు సహకరించాలని కోరారు.
Spread the love