బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు అర్ధరహితం: రోడ్డ బాపన్న 

నవతెలంగాణ – రామగిరి

అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి కాంగ్రెస్ నాయకుల పై అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని, మాజీ సర్పంచ్ తీగల నమ్మయ్య ధ్వజమెత్తారు. రామగిరి మండలం నాగేపల్లి క్రాస్ రోడ్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంథని పెద్దపల్లి ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సంబంధిత అధికారులు సులబ్ కాంప్లెక్స్ కూల్చివేస్తే కాంగ్రెస్ నాయకులే కక్ష కట్టి కూల్చివేశారని ఆరోపణలు చేయడం వారి అవివేకానికి నిదర్శనంగా నిరుస్తుందని దుయ్య బట్టారు. రోడ్డు విస్తరణ కోసం సులబ్ కాంప్లెక్స్ తొలగించాలని గత రెండు నెలలుగా వంచాయితీ సిబ్బందికి, నిర్వాహకులకు చెప్పినప్పటికీ స్పందించకపోవడంతోనే సంబంధిత అధికారులు కూల్చివేస్తే అవగాహన లేని బీఆర్ఎస్ నాయకులు అర్థరహిత ఆరోపణ చేయడం సరికాదన్నారు. సులబ్ కాంప్లెక్స్ నిర్మించే కంటే ముందు ఆ ప్రదేశంలో ఉన్న బస్సు షెల్టర్ ను ఎవరి అనుమతితో కూల్చారో బీఆర్ఎస్ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్లాట్లను స్వార్థం కోసం అమ్ముకున్న నాయకులు ఇప్పుడు నీతులు పలకడం దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా ఉందని ఎద్దేవా చేశారు. మా నాయకుడు రోడ్డు మీద నిర్మాణం చేసి కిరాయిలు తీసుకుంటున్నాడని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు మా నాయకుని నిర్మాణం సంబంధించి పూర్తి అనుమతులు ఉన్నాయని, మీ పార్టీ నాయకుడు సులబ్ కాంప్లెక్స్ వెనక అర్ అండ్ బి రోడ్డుపై నిర్మించిన గదికి అద్దె తీసుకోవడం లేదా, ఆ గది నిర్మాణానికి సంబంధించిన అనుమతులు ఏవైనా ఉంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధి విషయంలో మాట్లాడిన మాటను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడం ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. ఇప్పటికైనా మీడియా ముసుగులో బీఆర్ఎస్ నాయకుడు చేస్తున్న తప్పుడు మార్గాలను మానివేయకపోతే ప్రజలే తగిన గుణపాటం చెప్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రోడ్డ బావన్న, నాగేపల్లి మాజీ సర్పంచ్ ఎరుకల ఓదెలు, మాజీ ఎంవీటీనీ పొన్నం రామన్న గౌడ్, బిసి మండల పార్టీ అధ్యక్షుడు బండారి నదానందం, మాజీ ఉపసర్పంచ్లు వేగోళపు శ్రీనివాస్ గౌడ్, పొన్నం తిరుపతి, వేగోలవు రాయమల్లు, నాయకులు సట్ల రాజ్ కుమార్, తీగల కనుకయ్య, పొన్నం శ్రీనివాస్, పందుల సోము, ఎర్రం శంకర్, మడిపల్లి మొగిలి, గద్దల కుమార్, సమ్మయ్య, మైలారపు అనిల్, వేగోళప బాపు గౌడ్, బొల్లంపల్లి రాజు, శనిగరపు వెంకటేశు, మల్లు రాజు, అడప స్వామి, కనవేన రాజయ్య దూడం సదానందం తదితరులు పాల్గొన్నారు.
Spread the love