ప్రజా సేవకుడు పుట్టపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు అర్ధరహితం

– మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజా సేవకుడు, మంథని బీఆర్ఏస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధుపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు అర్ధరహితంగా ఉన్నాయని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుంభం రాఘవ రెడ్డి, తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ చెప్యాల రామారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మాట్లాడారు పుట్ట పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంథని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడం జరిగిందన్నారు. ఇలాంటి సేవాదృక్పదం ఉన్న నాయుడిపై కాంగ్రెస్ నాయకులు అవాకు,చవాకైన వ్యాఖ్యలు మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. కోరం లేకున్నా కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్లు అవిశ్వాసం పెట్టడం సిగ్గుచేటన్నారు.అవిశ్వాసం పెట్టి పిఏసిఎస్ కార్యాలయానికి హాజరు రాకుండా పారిపోవడం సరికాదన్నారు. అవిశ్వాసం పెట్టిన సభ్యులు బలప్రదర్శనకు రాకపోవడంపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ రుణాలు,ఎరువులు అందిస్తున్న తమపై అవాస్తాలు మాట్లాడటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గోనె శ్రీనివాసరావు, ఎంపిటిసి-,1 రావుల కల్పన మొగిలి, బిఆర్ఎస్ నాయకులు తాజాద్దీన్, కుమార్, రాజయ్య పాల్గొన్నారు.
Spread the love