జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీలకు కేటాయించిన భూమి అప్పగించాలి

– జర్నలిస్ట్‌ యునియన్‌ సిఎం కు వినతి
నవతెలంగాణ-హనుమకొండ
వరంగల్‌ నగరంలోని కాకతీయ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ, ఏకశిలా హౌసింగ్‌ సొసైటీ లకు దశాబ్దం క్రితం ప్రభుత్వం కేటాయించిన భూములను సత్వరం సొసైటీలకు అప్పగించి జర్నలిస్టుల సొంత ఇంటి కలను ఈ దశాబ్ది ఉత్సవాల్లో నెరవేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కు కాకతీయ, ఏకశిలా జర్నలిస్టు హౌసింగ్‌ కోపరేటివ్‌ సొసైటీలు విజ్ఞప్తి చేశాయి. ఈ విషయంలో వరంగల్‌ జిల్లా మంత్రులు, ప్రతినిధులు చొరవ చూపాలని సొసైటీలు కోరాయి. ఆదివారం హనుమకొండ ప్రెస్‌ క్లబ్‌ లో కాకతీయ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షులు ఎం. రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన రెండు సొసైటీల ఉమ్మడి సమావేశంలో కాకతీయ జర్నలిస్టు హౌసింగ్‌ కోపరేటివ్‌ సొసైటీ కార్యదర్శి సిహెచ్‌ సోమనరసయ్య, ఉపాధ్యక్షులు వీ. రమేష్‌ బాబు, డైరెక్టర్‌ బీ. దయాసాగర్‌, ఏకశిలా హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు పి. శివకుమార్‌ కార్యదర్శి బీఆర్‌ లెనిన్‌, కార్యవర్గ సభ్యులు గడ్డం కేశవమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు సొసైటీల బాధ్యులు మాట్లాడుతూ 2009లో రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ జర్నలిస్టు హౌసింగ్‌ కోఆపరేటివ్‌ సొసై టీకి కాజీపేట జాగీర్‌ సర్వేనెంబర్‌ 27 లో 4.20 ఎకరాలు భూమి కేటాయిస్తూ జీవో నెంబర్‌ 228 ను 2009 ఫిబ్రవరి 21న ప్రభుత్వం జారీ చేసింది. అలాగే ఏకశిలా జర్నలిస్టు హౌసింగ్‌ కోపరేటివ్‌ సొసైటీకి చింతగట్టులో 10.31 ఎకరాలు కేటాయిస్తూ జీవో నెంబర్‌ 301 ను 2009 ఫిబ్ర వరి 26న ప్రభుత్వం జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం జీవోల ద్వారా ద్వారా కేటాయించిన స్థలాలను సొసైటీలకు అప్పగించాలని కొన్నేళ్లుగా ప్రభుత్వ పెద్దలకు పలుమార్లు విన్నవించినట్లు తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన పల్లి వినోద్‌ కుమార్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ డి వినయ్‌ భాస్కర్‌, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చామని వారి సానుకూలతకు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల జరిగిన జర్నలిస్ట్‌ సంఘాల సమావేశాల్లో గతంలో కేటాయిం చిన స్థలాలు కొద్దిరోజుల్లోనే సొసైటీలకు ఇప్పించేలా కషి చేస్తానని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినరుభాస్కర్‌ హామీ ఇవ్వ డంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సమస్య పరి ష్కారంకు భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించారు. అలాగే సొసైటీల్లో సభ్యులుగా లేని జర్నలిస్టులందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కృషి చేయాలని సమావేశం తీర్మానించింది.

Spread the love