నవతెలంగాణ – ఆర్మూర్
అల్పెండజోల్ మాత్రలు తప్పకుండా వేసుకోవాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రమేష్ విద్యార్థులకు సూచించారు గురువారం జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో గల ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం మామిడిపల్లి వారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల విసర్జన తర్వాత, మట్టిలో ఆడిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని, చేతికి గోర్లను వారానికి ఒకసారి కత్తిరించుకోవాలని, లేదంటే వీటి ద్వారా మట్టి ఆహారం తీసుకునే సమయంలో కడుపులోకి వెళ్లి నులిపురుగులు తయారు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నారు. నులిపురుగులు కడుపులో ఏర్పడటం వల్ల తరచుగా కడుపునొప్పి మరియు రక్తహీనత ఏర్పడుతుందని విద్యార్థులకు సూచించారు. వంట చేసే సమయంలో కూరగాయలను శుభ్రంగా కలిగిన తర్వాతనే వండుకోవాలని తెలిపారు. ఆరు బయటకు మలవిసర్జనకు వెళ్ళినప్పుడు తప్పకుండా చెప్పులను వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సభ్యుని అధికారి సాయి ఆరోగ్య కార్యకర్తలు జక్కుల మోహన్ శ్యామల స్టాఫ్ నర్స్ స్రవంతి ఆశా కార్యకర్తలు మమత సుభద్ర శిరీష నవ్య రమ అరుణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.