నవతెలంగాణ – హైదరాబాద్: అమేజాన్ బజార్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రాలలో ఒకటిగా రూపొందాయని Amazon.in ఈరోజు ప్రకటించింది. రెండు రాష్ట్రాలలో ఆర్డర్లు ఏడాదికి 4 రెట్లు పెరిగాయి, సైన్ అప్ చేసిన కొత్త కస్టమర్లు 4 రెట్లు పెరిగి హైదరాబాద్ ముందు స్థానంలో నిలిచింది. రాష్ట్రాల్లోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం మరియు వరంగల్ లు తదుపరి స్థానంలో నిలిచాయి. 2026లో, సంవత్సరం ప్రారంభమైన మొదటి నాలుగు నెలల్లోనే హైదరాబాద్‌లో అమెజాన్ బజార్ 6 రెట్ల వృద్ధిని సాధించింది. రూ.99కి ఉత్పత్తులు ప్రారంభమవడం, ఉచిత డెలివరీ, సౌకర్యవంతమైన రిటర్న్స్, మరియు రెండు కోట్ల ఉత్పత్తులపై క్యాష్ బాక్ ఆఫర్లతో, ఫ్యాషన్ హోమ్, కిచెన్, మరియు ఎలక్ట్రానిక్ యాక్ససరీస్ లో తక్కువ బడ్జెట్ ను కోరుకునే బడ్జెట్ చైతన్యం కలిగిన వినియోగదారులకు అమేజాన్ బజార్ అభిమాన గమ్యస్థానంగా నిలిచింది.
రాష్ట్రంలో, అమేజాన్ బజార్ కు వివిధ శ్రేణుల్లో డిమాండ్ పెరిగింది. విమెన్స్ ఫ్యాషన్ ఏడాదికి 6 రెట్లు పెరిగింది, హోమ్ & కిచెన్ ఏడాదికి 8 రెట్లు, మరియు ఎలక్ట్రానిక్ యాక్ససరీస్ ఏడాదికి 4 రెట్లు పెరిగాయి. అగ్రశ్రేణిలో శారీస్, కుర్తాలు, ఫ్యాషన్ జ్యువలరీ, హోమ్ డెకార్, యుటిలిటి కిచెన్ వస్తువులు, మరియు మొబైల్ కవర్లు విక్రయించబడుతూ, స్టైల్ మరియు తక్కువ ధరలకే లభించే ఉత్పత్తులకు ప్రాధాన్యతనిచ్చే వినియోగదారుల సంఖ్యను సూచిస్తోంది.
ఈ ప్రకటన గురించి వ్యాఖ్యానిస్తూ, సమీర్ లాల్వాని, హెడ్-అమేజాన్ బజార్, అమేజాన్ ఇండియా ఇలా అన్నారు: “ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలు అమేజాన్ బజార్ కోసం గణనీయమైన వృద్ధి కేంద్రాలుగా ఉన్నాయి. ఆన్ లైన్ షాపింగ్ ప్రవర్తనలో ప్రత్యేకించి టియర్-2 మరియు టియర్-3 పట్టణాల్లో మేము నిర్మాణపరమైన మార్పును చూసాము. ఈ ప్రాంతాల్లోని వినియోగదారులు నాణ్యత, వివిధ రకాలు మరియు విలువలను సమాన స్థాయిలో కోరుతున్నారు. గత ఏడాదిలో సెల్లర్స్ రెట్టింపు కంటే ఎక్కువ అయిన కారణంగా, అత్యంత తక్కువ ధరలకు లభిస్తున్న ఉత్పత్తుల కోసం భారతదేశంవ్యాప్తంగా ఉన్న మా కస్టమర్ల నుండి వస్తున్న డిమాండ్ ను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ప్రతి పిన్ కోడ్ లో తక్కువ ధరలకు లభించే, అత్యంత ఉన్నతమైన ఎంపికను అందుబాటులో ఉంచడానికి మేము కట్టుబడ్డాము.”
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో Amazon.in లో 75,000 మందికి పైగా విక్రయదారులు ఉన్నారు, వీరిలో 1,200 మందికి పైగా విక్రయదారులు అమెజాన్ బజార్‌లో భాగంగా ఉన్నారు. అమెజాన్ బజార్‌లో విక్రయదారుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 2.4 రెట్లు పెరిగింది, దీనితో ఉత్పత్తుల ఎంపిక 2.5 రెట్లు విస్తరించింది మరియు స్థానిక వ్యాపారాలు దేశవ్యాప్తంగా వినియోగదారులను చేరుకోవడానికి వీలు కల్పించింది.
రెండు రాష్ట్రాలలోనూ వేగవంతమైన, నమ్మకమైన డెలివరీ అనే వాగ్దానాన్ని నెరవేర్చడానికి, అమెజాన్ ఈ ప్రాంతంలో 8 ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలు, 3 సార్టేషన్ కేంద్రాలు మరియు దాదాపు 1,500 హబ్ డెలివరీ భాగస్వాములతో తన కార్యకలాపాల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసింది. దీని ద్వారా చిన్న నగరాలు, పట్టణాలలో కూడా చివరి మైలు కనెక్టివిటీ సజావుగా ఉండేలా చూస్తోంది.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అమేజాన్ బజార్ మరింత మంది స్థానిక సెల్లర్స్ ను చేర్చుకోవడం, మహిళల ఫ్యాషన్, హోమ్ & కిచెన్ మరియు కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రాంతీయంగా ప్రసిద్ధి చెందిన శ్రేణుల ఎంపికలను విస్తరించడం, మరియు టియర్-2, టియర్-3 నగరాల్లో సుదూర ప్రాంతాల్లో కూడా డెలివరీని విస్తరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల్లో తన ఉనికిని శక్తివంతం చేయడానికి కట్టుబడి ఉంది. వినియోగదారులు ఎక్కడ నివసిస్తున్నా ఈ ప్రాంతంలోని ప్రతి వినియోగదారుకి అత్యంత తక్కువ ధరలకే లభించే ఉత్పత్తులు పొందేలా చేయడానికి కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.


