రేపటి నుంచి అమెజాన్‌ ‘బిజినెస్‌ వెల్యూడేస్‌’

బెంగళూరు : అమేజాన్‌ బిజినెస్‌ వ్యాపార కస్టమర్స్‌ కోసం జూన్‌ 24 నుండి 30 వరకు ‘బిజినెస్‌ వేల్యూ డేస్‌’ను ప్రకటించినట్లు అమెజాన్‌ ఇండియా తెలిపింది. ఇందులో వ్యాపార కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అనేక ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్‌ కల్పిస్తున్నట్లు పేర్కొంది. బిజినెస్‌ కస్టమర్స్‌ అదనంగా 10 శాతం లేదా రూ.9999 వరకు క్యాష్‌బ్యాక్‌ కూడా పొందవచ్చని తెలిపింది. స్మార్ట్‌ వాచెస్‌, గృహోపకరాలు, ఎలక్ట్రానిక్స్‌్‌ ఉత్పత్తులపై భారీ ఆఫర్స్‌ను అందిస్తున్నట్లు వెల్లడించింది.

Spread the love