– పరిశ్రమ అంతటా డెలివరీ అసోసియేట్ల కోసం విశ్రాంతి పాయింట్లను ఏర్పాటు చేయడానికి ‘ప్రాజెక్ట్ ఆశ్రయ్’ని ప్రారంభించిన అమెజాన్ ఇండియా
నవతెలంగాణ – హైదరాబాద్: డెలివరీ అసోసియేట్ల ఆరోగ్యంకు మద్దతివ్వాలనే తమ అచంచలమైన నిబద్ధతలో భాగంగా, అమెజాన్ ఇండియా ‘ప్రాజెక్ట్ ఆశ్రయ్’ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా, మొత్తం లాజిస్టిక్ పరిశ్రమలోని డ్రైవర్లు ఢిల్లీ ఎన్ సి ఆర్, బెంగళూరు మరియు ముంబై వంటి నగరాల్లోని వ్యూహాత్మక ప్రదేశాలలో విశ్రాంతి-పాయింట్లను వినియోగించుకునే అవకాశం పొందుతారు. ఉద్యాస ఫౌండేషన్ సహకారంతో, తొలుత పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఐదు ఆశ్రయ్ కేంద్రాలను అధిక ఫుట్‌ఫాల్ ప్రదేశాలలో ఏర్పాటు చేయనుంది , మొదటి ఆశ్రయ్ కేంద్రాన్ని బౌలేవార్డ్, మాలిబు టౌన్, సెక్టార్ 47, గురుగ్రామ్ వద్ద అంతర్జాతీయ కార్మిక సంస్థలో కంట్రీ డైరెక్టర్ – ఇండియా మిచికో మియామోటో ప్రారంభించారు. “అమెజాన్ వద్ద , డెలివరీ అసోసియేట్లకు ఆన్-రోడ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, పరిశ్రమలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలను అందించటానికి మరియు ఉత్తమ పద్ధతులను నిర్వహించడానికి మేము కట్టుబడి ఉన్నాము. డ్రైవర్ అనుభవం మరియు ఆరోగ్యంను మెరుగుపరచడానికి మేము చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో ‘ప్రాజెక్ట్ ఆశ్రయ్’ ఒక ముఖ్యమైన భాగం. అవసరమైన సదుపాయాలతో కూడిన ప్రత్యేక విశ్రాంతి పాయింట్లు అందించడం ద్వారా, అమెజాన్ లేదా ఇతర కంపెనీలతో సంబంధం ఉన్న డెలివరీ అసోసియేట్‌లందరూ పని చేస్తున్నప్పుడు సాధ్యమైనంత ఉత్తమమైన మరియు అత్యంత సౌకర్యవంతమైన వాతావరణాన్ని కలిగి ఉండేలా చూడాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ అన్నారు.
“ డెలివరీ అసోసియేట్లకు విశ్రాంతి మరియు రీఛార్జ్ అనుభవాలను పొందడానికి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రదేశాలకు తగిన అవకాశాలను నిర్ధారించడంలో అమెజాన్ యొక్క ఆశ్రయ్ కేంద్రాల ప్రారంభం సహాయపడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు విభిన్న రంగాలలోని కార్మికులకు సురక్షితమైన పని పరిస్థితులను నిర్ధారించడంలో ప్లాట్‌ఫారమ్ యొక్క నిబద్ధతకు అనుగుణంగా ఉంటాయి. ఇటువంటి మంచి పద్ధతులు భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ప్లాట్‌ఫారమ్ కార్మికులకు కార్మిక మరియు సామాజిక రక్షణను విస్తరించడంలో చొరవ తీసుకోవడానికి మరింత మంది వాటాదారులను ప్రేరేపించగలవని మేము ఆశిస్తున్నాము ” అని అంతర్జాతీయ కార్మిక సంస్థలో ఇండియా కంట్రీ డైరెక్టర్ మిచికో మియామోటో అన్నారు.
డెలివరీ అసోసియేట్ల ఆరోగ్యం మరియు భద్రతను నిర్ధారించడానికి అమెజాన్ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా, విశ్రాంతి ేంద్రాలు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవర్ల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా అనేక సౌకర్యాలను అందిస్తాయి. ఈ రెస్ట్ పాయింట్లలో సౌకర్యవంతమైన సీటింగ్, స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం మరియు మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లు ఉంటాయి, డెలివరీల నుండి విరామం తీసుకునేటప్పుడు అసోసియేట్లు తగిన విశ్రాంతి, హైడ్రేట్ మరియు రీఛార్జ్ చేసుకోగలరని నిర్ధారిస్తుంది. వివిధ కంపెనీల నుండి డెలివరీ అసోసియేట్లకు యాక్సెస్‌ను అందిస్తూ అధిక సంఖ్యలో వ్యక్తులకు కూడా ఆశ్రయ్ కేంద్రాలు సౌకర్యం అందిస్తాయి. ఒక్కో కేంద్రంలో ఒకేసారి 15 మంది వరకు కూర్చోవడానికి వీలుగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేస్తుంది. సదుపాయం యొక్క వినియోగం ఉచితం మరియు డెలివరీ అసోసియేట్ యొక్క ప్రతి సందర్శన 30 నిమిషాలకు పరిమితం చేయబడుతుంది.
డెలివరీ అసోసియేట్లకు ఈ విశ్రాంతి పాయింట్ల గురించి అవగాహన కల్పించడానికి ఆశ్రయ్ బహుళ కార్యక్రమాలను చేపడుతుంది. అమెజాన్ డెలివరీ అసోసియేట్ల కోసం అదనంగా, సులభమైన యాక్సెస్ కోసం గూగూల్ మ్యాప్స్‌లో ఈ స్థానాలు జోడించబడతాయి. ఈ కేంద్రాలలో డెలివరీ అసోసియేట్ల కోసం పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేయబడతాయి. డెలివరీ అసోసియేట్లు మరియు డ్రైవర్లకు మద్దతు ఇవ్వడానికి కొనసాగుతున్న నిబద్ధతలో భాగంగా, అమెజాన్ ఇండియా రాబోయే నెలల్లో ప్రాజెక్ట్ ఆశ్రయ్ కింద అదనపు విశ్రాంతి సౌకర్యాల అభివృద్ధి కోసం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) మోడల్‌ను కూడా అన్వేషిస్తోంది. ఈ ప్రతిపాదిత సౌకర్యాలలో మహిళా డ్రైవర్ల భద్రత, వర్షాకాలం లేదా వేడిగాలుల సమయంలో నీడ, తాగునీరు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ప్రథమ చికిత్స మద్దతు మరియు ప్రభుత్వ సబ్సిడీ ధరల వద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఛార్జింగ్ సదుపాయం ఉండేలా రక్షణతో కూడిన విశ్రాంతి గదులు ఉంటాయి. ఇంకా, ట్రక్ డ్రైవర్ల కోసం సమగ్ర ఆరోగ్యం మరియు సంరక్షణ కార్యక్రమం అయిన ‘సుశ్రుత’ మరియు డెలివరీ అసోసియేట్ల పిల్లల విద్యకు మద్దతు ఇచ్చే ‘ప్రతిధి’ స్కాలర్షిప్ వంటి కార్యక్రమాలను అమెజాన్ ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా, అమెజాన్ డెలివరీ అసోసియేట్లకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను మరియు శ్రద్ధగల కార్యాలయాన్ని ప్రారంభించడంలో తన నిబద్ధతను పునరుద్గాటించింది.