Saturday, May 2, 2026
E-PAPER
Homeఆటలుసన్‌రైజర్స్‌ గూటికి అంబరీశ్‌

సన్‌రైజర్స్‌ గూటికి అంబరీశ్‌

- Advertisement -

శివం మావి స్థానంలో ఎంచుకున్న ప్రాంఛైజీ
హైదరాబాద్‌ : భారత యువ ఆల్‌రౌండర్‌, ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఆర్‌.ఎస్‌ అంబరీశ్‌ ఐపీఎల్‌19లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. సన్‌రైజర్స్‌ వేలంలో తీసుకున్న పేసర్‌ శివం మావి గజ్జల్లో గాయంతో సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో సన్‌రైజర్స్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అంబరీశ్‌ను ఎంచుకుంది. శివం మావిని సన్‌రైజర్స్‌ రూ.75 లక్షలకు కొనుగోలు చేయగా.. రూ.30 లక్షల కనీస ధరకు అంబరీశ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో వికెట్ల వేటలో మెప్పించిన అంబరీశ్‌.. భారత అండర్‌-19 జట్టు తరఫున ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో రాణించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా ఐదు విజయాలతో జోరు మీదున్నా.. బౌలింగ్‌ విభాగంలో వరుస గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. జాక్‌ ఎడ్వర్డ్స్‌, బ్రైడన్‌ కార్సె, డెవిడ్‌ పైన్‌లు గాయంతో తప్పుకోగా.. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఫిట్‌నెస్‌ సమస్యలతో తొలి ఏడు మ్యాచ్‌లు ఆడని సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుండగా.. బుధవారం పంజాబ్‌ కింగ్స్‌ ఢకొీట్టనుంది. ఆర్‌ఎస్‌ అంబరీశ్‌ లీగ్‌ దశ ఆఖర్లో అరంగ్రేట అవకాశం దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -