రాజస్తాన్‌పై ఘన విజయం
ఛేదనలో రాహుల్, నిశాంక మెరుపులు
నవతెలంగాణ-జైపూర్
హ్యాట్రిక్ ఓటముల నైరాశ్యం నుంచి బయటపడిన ఢిల్లీ క్యాపిటల్స్ జైపూర్‌లో అదిరే విజయం సాధించింది. 226 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపొందింది. ఛేదనలో ఓపెనర్లు కెఎల్ రాహుల్ (75, 40 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), పతుం నిశాంక (62, 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. నితీశ్ రానా (33), ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్), ఆషుతోష్ శర్మ (25 నాటౌట్) సైతం రాణించటంతో మరో 5 బంతులు ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) నిరాశపరిచినా.. కెప్టెన్ రియాన్ పరాగ్ (90, 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), ధ్రువ్ జురెల్ (42, 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఫెరీరా (47, 14 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో మెరిసిన కెఎల్ రాహుల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. సీజన్లో పది మ్యాచ్‌ల్లో రాయల్స్‌కు ఇది నాల్గో ఓటమి కాగా.. 9 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది నాల్గో విజయం.
ఢిల్లీ ధనాధన్
- Advertisement -
- Advertisement -



