Saturday, May 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయూనియన్లు ఐక్యంగా ఉండాలి

యూనియన్లు ఐక్యంగా ఉండాలి

- Advertisement -

ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత
ఇన్సూరెన్స్‌, ఆర్బీఐ, బ్యాంక్‌ ఉద్యోగుల మేడే ఉత్సవాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వాలు స్వతంత్రంగా పాలించకుండా ఐఎంఎఫ్‌ తదితరుల చెప్పుచేతుల్లో ఉంటూ వారు చెప్పినట్టుగానే వ్యవహరిస్తున్నాయని శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత విమర్శించారు. శుక్రవారం ఇన్సూరెన్స్‌, ఆర్బీఐ, బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లో మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్బీఐ ప్రధాన కార్యాలయంలో ఆర్బీఐ ఎంప్లాయీస్‌ అసోసి యేషన్‌ ప్రెసిడెంట్‌ జి.క్రాంతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సుజాత మాట్లా డుతూ పాలకుల విధానాలకు వ్యతిరేకంగా యూనియన్లు ఐక్యంగా ఉండాలనీ, పోరాట పటిమను, పంథాను మార్చాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా పోరాటాలు జరుగుతున్నా.. పాలకులకు వత్తాసు పలుకుతున్న మీడియా సంస్థలు ఒకరి పోరాటాలు మరొకరికి తెలియకుండా చేస్తున్నాయని వివరించారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా అమెరికాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. పోరాటాలు ఆర్థిక ప్రజాస్వామ్యం వైపు వెళ్లాలని ఆమె ఆకాంక్షించారు. యూనియన్లలో రాజకీయ అవగాహన పెరగాలని అభిప్రాయపడ్డారు. ఇన్సూరెన్స్‌ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి టీవీఎన్‌ఎస్‌ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ కార్మికులు తమ ఉనికిని కాపాడుకునే పరిస్థితిలోకి నెట్టబడుతున్నారనీ, గతంలో ఎన్నడూ లేనంతంగా అసమానతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -