మళ్లీ యుద్ధం చేస్తే ట్రంప్ ఏకాకి : రాజ్యసభ మాజీ సభ్యులు పి మధు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
అంతర్జాతీయ యుద్ధ ప్రమాణాల ప్రకారం ఏ దేశం మీదనైనా 60 రోజులకు మించి యుద్ధం చేయరాదని, ఇప్పుడు అమెరికా అధ్యక్షులు ట్రంప్‌నకు యుద్దం చేసే గడువు ముగిసిందని, రేపటి నుంచి యుద్ధం చేయాల్సి వస్తే… భద్రతామండలి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు పి. మధు అన్నారు. మేడే సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలో సీపీఐ(ఎం) కార్యాలయం సమీపంలో ఎర్రజెండాను ఎగరవేసిన అనంతరం మాట్లాడారు. మేడేను దీక్షా దినంగా పాటించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలన్నారు. చైనా, రష్యా, ఇండియా దేశాలు ఇరాన్ నుంచి అయిల్ దిగుమతి కోసం డాలర్ నుంచి కాకుండా ఆయా దేశాల డబ్బులు పెట్టి కొనడం ద్వారా ట్రంప్ ఆధిపత్యానికి పతనం మొదలయ్యిందని చెప్పవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో పాటు మన దేశంపైనా యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. యుద్ధం నివారణ విషయంలో మోడీ విధానం సరైంది కాదన్నారు. కార్మిక చట్టాలు, హక్కులు ఎవరో పెట్టిన బిక్ష కాదని కార్మిక, కర్షక , మహిళా ఉద్యమాలతో సాధించుకున్నవని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి ఎ. రాములు, కార్యదర్శివర్గ సభ్యులు కిల్లె గోపాల్, కురుమూర్తి, నాయకులు కిష్టయ్య, విజయకుమార్, చంద్రకాంత్, ప్రశాంత్, బుర్రి భాస్కర్, సురేష్ పాల్గొన్నారు.
గడువు ముగిసింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



