Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వజ్రఖండిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు

వజ్రఖండిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు

- Advertisement -


నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని వజ్రఖండి జిపి గ్రామంలో గ్రామ సర్పంచ్ సింత్రాళే సావిత్రి అధ్యక్షతను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ రాంజీ అంబేద్కర్ జయంతి వేడుకలు ఉప సర్పంచ్ తో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంతో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చెసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సింత్రాళే సావిత్రి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాల్యంలో అంటరానితనంలో పలు అనుమానాలకు లోనయ్యాడు అని అన్నారు.

అస్పృశ్య నివారణ కొరకు ఎన్నో పోరాటాలు చేసి గొప్ప నాయయకుడుగా క్యాతిగడించారు. మరణాంతరం భారతరత్న అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్,  జిపి వార్డు సభ్యులు , జిపి కార్యదర్శి , మహిళలు,  దళిత నాయకుడు , యువకులు, గ్రామస్తులు , ప్రజలు , తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -