వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూకంటి పౌలు
నవతెలంగాణ – ఆలేరు రూరల్
సామాజిక సమానత్వం సాధనకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలు మార్గదర్శకంగా నిలుస్తాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూకంటి పౌలు అన్నారు. మంగళవారం ఆలేరు మండలం పటేల్ గూడెం గ్రామంలో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అంబేద్కర్ జీవితమంతా అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం అయిందన్నారు.
సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ఆయన పోరాడారని తెలిపారు. విద్య సంఘటితం కావడం,పోరాటం అనే ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా సామాజిక న్యాయం సాధించాలంటే అంబేద్కర్ చూపిన మార్గంలోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరు ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్యార అశోక్,ఏమాలియా, సురేష్, బాబు, కోయ యాదమ్మ గ్యార మాలతి తదితరులు పాల్గొన్నారు.



