అమెరికాలో ప్రాణ వాయువుతో తొలి మరణ శిక్ష..

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని అలబామా రాష్ట్రంలో తొలిసారిగా కొత్త పద్ధతిలో మరణ శిక్ష అమలు చేశారు. ఇప్పటివరకూ వినియోగిస్తున్న ప్రాణాంతక ఇంజెక్షన్లకు బదులు నైట్రోజన్ వాయువు ప్రయోగంతో కెన్నెత్ యూజీన్ స్మిత్‌కు హోల్‌మన్ కారాగారంలో మరణశిక్ష అమలు చేశారు. శిక్ష అమలు కోసం నిందితుడికి నైట్రోజన్ వాయువు మాత్రమే విడుదల చేసే ఓ మాస్క్‌ను తొడిగారు. ఈ క్రమంలో నిందితుడు ప్రాణవాయువు అందక తొలి రెండు నిమిషాలు అల్లాడాడు. ఆ తరువాత కొన్ని నిమిషాలపాటు బలంగా శ్వాస తీసుకున్నాక చివరకు అచేతన స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ శిక్ష అమలను వీక్షించేందుకు నిందితుడి భార్య, బంధువులతో పాటూ పలువురు జర్నలిస్టులను కూడా జైలు అధికారులు అనుమతించారు. నిందితుడు తన భార్యను చూస్తూ ఐ లవ్ యూ అని చెప్పాడు. ‘‘నేడు అలబామా రాష్ట్రం మానవత్వం తిరోగమించేలా చేసింది’’ అని అతడి చివరిసారిగా అన్నట్టు జర్నలిస్టులు తెలిపారు. మొత్తం 22 నిమిషాల్లో శిక్ష పూర్తయినట్టు తెలిసింది. అయితే, అలబామాతో పాటూ ఓక్లహోమా, మిసిసిప్పీ రాష్ట్రాలు కూడా నైట్రోజన్ వాయువుతో మరణశిక్షకు ఆమోదం తెలిపాయి.

Spread the love