అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీ నుంచి తప్పుకున్న వివేక్‌ రామస్వామి

నవతెలంగాణ హైదరాబాద్: అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వం (President Race) కోసం రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీపడుతున్న భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అభ్యర్థిత్వం విషయంలో ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసన్‌ ఎన్నికల్లో వివేక్‌ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇదే సమయంలో మరోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రైమరీ ఎన్నికల్లో తన హవా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తొలి విజయం నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వివేక్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను అధ్యక్ష బరిలో నుంచి తప్పుకుంటున్నట్టు మంగళవారం ప్రకటించారు.

Spread the love