Wednesday, April 29, 2026
E-PAPER
Homeసినిమాఎంటర్‌టైన్‌ చేసే కామెడీ థ్రిల్లర్‌

ఎంటర్‌టైన్‌ చేసే కామెడీ థ్రిల్లర్‌

- Advertisement -

హాస్యనటుడు సత్య, దర్శకుడు రితేష్‌ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెద్దా మల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పిస్తోంది. మిస్‌ యూనివర్స్‌ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్నారు. వెన్నెల కిషోర్‌, అజరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మే 1న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చెర్రీ మీడియాతో ముచ్చటించారు. ఇది పూర్తిగా డిఫరెంట్‌ సబ్జెక్ట్‌. దాదాపు 80 శాతం సినిమా ఫ్లైట్‌లోనే జరుగుతుంది. అది చాలా ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌. రితేష్‌ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. నాకు చిన్న సినిమాలు, ఎక్స్‌పెరిమెంటల్‌ సినిమాలు చేయాలనే ఆసక్తి ఉంటుంది. ప్రొడక్షన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో రిస్క్‌ తక్కువగా ఉండే కథలను ఎంచుకుంటూ ‘మత్తు వదలరా’, ‘హ్యాపీ బర్త్‌డే’, ‘మీటర్‌’, ‘జెట్లీ’ సినిమాలు చేశాం. ‘హ్యాపీ బర్త్‌డే’, ‘మీటర్‌’ థియేటర్లలో ఆశించినంతగా ఆడకపోయినా, కమర్షియల్‌గా మంచి రిజల్ట్‌ ఇచ్చాయి. ఈ కథలో కొన్ని సన్నివేశాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అవి కామెడీ టైమింగ్‌ ఉన్న యాక్టర్స్‌ చేస్తేనే బాగా పండుతాయి. సత్యకు కథ చెప్పినప్పుడు ‘నేను హీరోనా’ అని మొదట కొంచెం ఆలోచించాడు. కానీ డైరెక్టర్‌ వివరంగా చెప్పిన తర్వాత ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో అందరికీ సమాన ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లు ఉంటాయి. సినిమా చూశాం. చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ఒక మంచి కామెడీ థ్రిల్లర్‌. కామెడీ పర్ఫెక్ట్‌గా వర్క్‌ అవుతుంది. సత్య, వెన్నెల కిషోర్‌, గుండు సుదర్శన్‌, అజరు… ఇలా అన్ని పాత్రలు బాగా అలరిస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -