Wednesday, April 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పది ఫలితాల్లో సెంట్ మేరీ హైస్కూల్ ప్రభంజనం 

పది ఫలితాల్లో సెంట్ మేరీ హైస్కూల్ ప్రభంజనం 

- Advertisement -

నవతెలంగాణ-మిడ్జిల్ 
మిడ్జిల్ మండల కేంద్రంలో సెయింట్ మేరీస్ హై స్కూల్  విద్యార్థులు బుధవారం వెలువడిన పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. మండలంలో మొదటి ర్యాంకు J. విష్ణు 559/600, మూడవ ర్యాంకు M.సహాని 553/600 తోపాటు 500 కు పైగా 23 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎంప్రయిల్ జోసెఫ్, ప్రిన్సిపల్ డైసన్ చేరియన్ పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరినీ అభినందించారు. కార్యక్రమంలో లింగం, రవికుమార్ , షినిష్ ,హేమలత, బర్కు మెన్ జోసెఫ్ ,సజెష్ ,దుర్గ భవాని , ఆంజనేయులు తదితర ఉపాధ్యాయులందరూ విద్యార్థులను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -