అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థి రేసులో భార‌తీయుడు..

నవతెలంగాణ- న్యూఢిల్లీ: అమెరికా దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భారత్‌కు చెందిన వివేక్ రామ‌స్వామి రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున పోటీప‌డేందుకు ఆస‌క్తిగా ఉన్నారు. ఆ పార్టీ అభ్య‌ర్ధిత్వం కోసం ఆయ‌న ప్ర‌చారం కూడా మొద‌లుపెట్టారు. అయితే వివేక్ రామ‌స్వామిపై బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఎక్స్ సోష‌ల్ మీడియా అకౌంట్‌లో వివేక్‌కు చెందిన ఓ వీడియోను ఆయ‌న పోస్టు చేశారు. ఫాక్స్ న్యూస్ యాంక‌ర్ ట‌క్క‌ర్ కార్ల్‌స‌న్‌తో జ‌రిగిన సంభాష‌ణ‌ను ఆ వీడియోలో అప్‌లోడ్ చేశారు. వివేక్ రామ‌స్వామి చాలా ప్రామిసింగ్ ఉన్న‌ట్లు మ‌స్క్ తెలిపారు. 37 ఏళ్ల రామ‌స్వామి.. రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున అధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీప‌డేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ని, ఈ అభ్య‌ర్థి విశ్వ‌సనీయంగా క‌నిపిస్తున్న‌ట్లు మ‌స్క్ త‌న ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నారు. I వివేక్ రామ‌స్వామి.. హార్వ‌ర్డ్‌, యేల్ యూనివ‌ర్సిటీల్లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు. కేర‌ళ‌కు చెందిన భార‌తీయ జంట‌కు ఆయ‌న జ‌న్మించారు.

Spread the love