స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం

హైదరాబాద్‌: విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న సంఘటనలు కొనసాగుతున్నాయి. ఇటీవలకాలంలో పెద్ద సంఖ్యలో విమానాల్లో సమస్యలు ఉత్పన్నమవగా.. విమానాలు మళ్లింపు, అత్యవసర ల్యాండింగ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌ – నాసిక వెళ్లే స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు విమానాన్ని వెనక్కి మళ్లించి ల్యాండింగ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. స్పైస్‌జెట్‌ కంపెనీకి చెందిన విమానం ఉదయం 6.20 గంటలకు నాసిక్‌కు బయలుదేరింది. కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్యను పైలెట్లు గుర్తించారు. ఆ తర్వాత అధికారుల ఆదేశాలకు మేరకు పైలెట్లు విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించి.. దాదాపు అరగంట తర్వాత ల్యాండ్‌ చేశారు. అయితే, తకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో విమానం కోసం రెండు గంటల నుంచి ఎదురుచూస్తున్నామని, అధికారుల నుంచి సరైన స్పందన రావడం లేదని ప్రయాణికులు ఆందోళన చేపట్టారు.

Spread the love