బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైలు ప్రమాదాలు: తమ్మినేని

నవతెలంగాణ- హైదరాబాద్: ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లా పగిడిపల్లి- బొమ్మాయిపల్లి మధ్య సికింద్రాబాద్ వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగి బోగీలు కాలిపోవడం బాధాకరం. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికుల యొక్క సర్టిఫికెట్స్, సామాగ్రి, తదితరాలు కాలి బూడిదైపోయాయి. ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు.  బీజేపీ ప్రభుత్వం రైల్వే శాఖ పట్ల అనుసరిస్తున్న నిర్లక్షమే ఈ ప్రమాదానికి కారణమని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ భావిస్తున్నది. రైల్వే లైన్లు, సిగ్నల్స్‌ వ్యవస్ధ, ట్రాకుల ఆధునీకరణ, బోగీల మరమ్మతులు, అవసరమైన సదుపాయాలు చేపట్టక పోవడం వలన ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అలాగే రైల్వేశాఖలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం కూడా మరొక కారణం. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తున్నది.
Spread the love