స్టోక్స్‌ కెప్టెన్ ఇన్నింగ్స్.. 6 వికెట్ల‌తో క‌మిన్స్ మ్యాజిక్

నవతెలంగాణ – లండన్: యాషెస్ మూడో టెస్టులోనూ ఇంగ్లండ్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. బాజ్‌బాల్ ఆట‌తో ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్ట‌బోయి వికెట్లు స‌మ‌ర్పించుకున్నారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ 6 వికెట్ల‌తో విజృంభించ‌డంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 237 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది. 31 ప‌రుగుల ఆధిక్యం సంపాదించింది. ఒకద‌శ‌లో ఇంగ్లండ్ 150 లోపే ఆలౌట‌య్యేలా క‌నిపించిది. అయితే.. ఆతిథ్య జ‌ట్టును మ‌రోసారి కెప్టెన్ బెన్ స్టోక్స్(80) హాఫ్ సెంచ‌రీతో ఆదుకున్నాడు. సెంచ‌రీ దిశ‌గా వెళ్తున్న అత‌డిని టాడ్ మ‌ర్ఫీ బోల్తా కొట్టించాడు. అత‌డి బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ క్యాచ్ ప‌ట్ట‌డంతో స్టోక్స్ ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది. క‌మిన్స్ దెబ్బ‌కు విల‌విల‌ ఆస్ట్రేలియాపై చెల‌రేగి ఆడే స్టోక్స్ మ‌రోసారి త‌న మార్క్ ఆట‌తో ఆక‌ట్టుకున్నాడు. లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన‌ రెండో టెస్టులో జ‌ట్టును ఓట‌మి నుంచి త‌ప్పించేదుకు క‌డ‌దాకా పోరాడాడు. ఒక‌వైపు విక‌ట్లు ప‌డుతున్నా ధాటిగా ఆడి సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. కానీ, మిగ‌తావాళ్లు క్రీజులో నిల‌బ‌డ‌క‌పోవ‌డంతో ఇంగ్లండ్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. 6 వికెట్లు తీసిన క‌మిన్స్‌ను అభినందిస్తున్న స‌హ‌చ‌రులు మూడో టెస్టులో ఆసీస్‌ను త‌క్కువ‌కే క‌ట్ట‌డి చేసిన ఇంగ్లండ్‌కు ఆ ఆనందం ఎంతో సేపు నిల‌వలేదు. ప్యాట్ క‌మిన్స్ దెబ్బ‌కు ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాళ్లంతా పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. ఓపెన‌ర్ జాక్ క్రాలే(33), మార్క్ వుడ్‌(24), మోయిన్ అలీ(21) మాత్ర‌మే ఫ‌ర్వాలేద‌నిపించారు. మాజీ కెప్టెన్ జో రూట్‌(19), హ్యారీ బ్రూక్‌(3), బెన్ డ‌కెట్‌(2), జానీ బెయిర్‌స్టో(12) స్వ‌ల్ప వెనుదిర‌గ‌డంతో ఇంగ్లండ్ కోలుకోలేక‌పోయింది.

Spread the love