శంషాబాద్ ఎయిర్ పోర్టు‌లో భారీగా బంగారం ప‌ట్టి‌వేత‌

హైదరాబాద్: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తరచూ బంగారం పట్టుబడుతూనే ఉంటుంది. నేడు మరోసారి విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మహ్మద్ ఆష్కర్ అనే ప్రయాణికుడి వద్ద రూ.85 లక్షల విలువ చేసే 1512 గ్రాముల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. మహ్మద్ ఆష్కర్ బంగారాన్ని కరిగించి పేస్టుగా మార్చి లగేజ్ బ్యాగ్‌లో దాచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆష్కర్ అడ్డంగా దొరికిపోయాడు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Spread the love