అప్రమత్తంగా ఉండాలి: సీఎస్‌ శాంతికుమారి

కలెక్టర్లు, అధికారులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్‌
కలెక్టర్లు, అధికారులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్‌

నవతెలంగాణ హైదరాబాద్: వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆమె భారీ నుంచి అతిభారీ వర్షాలతో ముప్పు పొంచి ఉందని, ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదురొనేందుకు సిద్ధంగా ఉండేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు. కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, దుర్బలమైన కాజ్‌వేలు, వంతెనలను ఇప్పటికే గుర్తించినట్టు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా తెలిపారు. అగ్నిమాపక శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల కార్యాలయాల్లో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసినట్టు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు.

Spread the love