ఇంజినీరింగ్ బీ కేటగిరి సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదల…

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగాను బీటెక్‌‌, బీ.ఫార్మసీ, ఫార్మ్‌-డీ కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటా  సీట్ల భర్తీకిగాను ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ ప్రకటించింది. జూలై 20న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. అదే రోజు నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. జూలై 31న దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఆయా కాలేజీలు వచ్చే నెల 15న ఎంపికైన విద్యార్థుల జాబితాను సర్పించాల్సి ఉంటుంది. దీనిద్వారా రాష్ట్రంలోని ప్రైవేడు ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో ఉంటే 30 శాతం సీట్లను ఫిల్‌ చేస్తారు. ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ఇప్పటికే ముగింసింది. దీనిద్వారా వివిధ కోర్సుల్లోని 70,665 సీట్లను భర్తీ చేశారు. ఇక రెండో విడత కౌన్సెలింగ్‌ ఈ నెల 24 నుంచి ప్రారంభంకానుంది. చివరి దశ ఆగస్టు మొదటి వారంలో ఉంటుంది.

Spread the love