ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం!

– నేడు ప్రభుత్వ పాఠశాలల్లో ‘పీటీఎం’
– విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆహ్వానం
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యార్థుల చదువు, ప్రభుత్వ పాఠశాలల బలో పేతానికి తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచేలా పీటీఎం(పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్‌) నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఆగస్టులో ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందిం చేందుకు తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి నెలా మూడో శనివారం పీటీఎం నిర్వహించి తరగతుల వారీగా విద్యార్థుల ప్రగతిని సమీక్షిస్తున్నది.
ఈ విద్యాసంవత్సరం తొలి పీటీఎం సమా వేశం శనివారం నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న 691 పాఠశాలల్లో ప్రారంభించడానికి హెచ్‌ఎంలు, సమగ్ర శిక్షణ అధికారులు పీటీఎంకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికీ ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ప్రధానో పాధ్యాయులు విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు చేరవేశారు. ప్రతి తరగతిలోని విద్యార్థి తల్లిదండ్రులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీచేశారు. ఆపై పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌లో చర్చించిన అంశాల నివేదికను మండల విద్యాధికారులు, డీఈవోకు సమర్పించాలి. మీటింగ్‌ ఫొటోలు విధిగా ఉన్నతాధికారులకు పంపించాలి. పీటీఎంను అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాల్సి బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
పీటీఎం నిర్వహణపై సూచనలు
– పిల్లల విద్యాపరమైన ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర అతి కీలకం. అందువల్ల పీటీఎంలో తల్లిదండ్రుల హాజరు వందశాతం ఉండేటట్టుగా చూడాలి.
– ప్రధానోపాధ్యాయులు ముందుగానే విద్యార్థుల ద్వారా రాతపూర్వకంగా, ఆహ్వానం పంపడం ద్వారా తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం అందించాలి.
– ఇప్పటివరకు హాజరుకాని తల్లిదండ్రులపై హెచ్‌ఎంలు ప్రత్యేకంగా దృష్టి సారించి, వారు తప్పకుండా హాజరయ్యేటట్టు చూడాలి.
– గ్రామీణ ప్రాంతంలో చాలా మంది తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో నిమగమై ఉండటం.. పట్టణ ప్రాంతాల్లో ఇతర పనుల్లో నిమగమై ఉండటం వల్ల తల్లిదండ్రులు సమావేశానికి హాజరయ్యేలా చేయడానికి, వారికి అనుకూలమైన సమయానికి పీటీఎం నిర్వహించాలి.
– ప్రధానోపాధ్యాయులు పీటీఎం సమావేశ విషయాలను రికార్డ్‌ (మినిట్స్‌) చేయాలి.
– మండల విద్యాశాఖాధికారులు నేడు(శనివారం) జరగనున్న పేరెంట్‌ – టీచర్స్‌ మీటింగ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు, అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలు అందించాలని తెలియజేశారు.

Spread the love